సంపూర్ణ ప్రధమ సర్గ
అంత శత్రు మర్ధనుడు ఆలోచించి
చారణులేగు గతి ననుసరించి
సీత వెదకను పయనమగుటకు
జలధి దాటను నిశ్చయించే ....1
మున్నెవ్వరు జగతిన చేయనట్టి
పనిని హనుమ తలపెట్టినాడు
బుసలు కొట్టు మహిషము రీతిన
మెడను చాచి తలను యెత్తెను ....2
రొమ్ము పెంచిన పవన సుతుడు
పచ్చ కాంతితొ మెరిచిపోయెను
చూచు వారికి వీర హనుమ
హరిత మణివలె కాన వచ్చెను ....3
సింహ భంగిన హనుమ తిరిగెను
రొమ్ము తగలగ చెట్ట్లు కూలెను
జంతు జాలము నలిగి చచ్చెను
చిన్న పక్షులు బెదిరి చచ్చెను ....4
వివిధ రూపులు దాల్చ గలిగిన
యక్ష కిన్నెర గంధర్వాదులతొ,
దైవ శక్తులు చాల గలిగిన
మణులు మెరయు ఫణులతొ
నలుపు తెలుపు యెరుపు నీలము
పచ్చ రంగుల కాంతులీను శిలలతో,
మేలు జాతుల హస్తి మూకలు
ఆటలాడు కొలాహలములతొ
భాసిల్లు తున్నది మహేంద్ర గిరి
అట్టి పర్వతము వద్ద నిలిచిన
కొతి మారుతి, తటము దిగిన
మదపుటేనుగు వలె వెలుగు చుండెను ....5.6.7.
బయలుదేరగ నిశ్చయించి
గురువు రవిని, తండ్రి వాయుని
తాత బ్రహ్మని, దిక్పతింద్రుని
సమస్త భూతములని ప్రార్ధించె ....8
దక్షణమునకు వెళ్ళ దలచి
తండ్రి వాయుకు, తూర్పు తిరిగి
మరొ మారు నమస్కరించి
శరీరమంతను పెంచ సాగెను ....9
తోటి మూకలు చూచు చుండగ
రామ కార్యము చక్క పరచగ
పూర్ణిమందున ఎగురు అలలవలె
హనుమ ఎగుర నిశ్చయించెను ....10
ఒక్క వుదుటన సంద్ర మెగరగ
లెఖ్ఖ కందక తనువు పెంచుచు
ప్రక్కనున్న కొండ చూచెను
చేయి కాలుతొ బాగ చరిచెను ....11
దెబ్బ తగిలిన కొండ మొత్తము
ఒక్క సారిగ ఊగి పోయెను
కొండ పైని చెట్ట్లు లతల
పూలు వాన వలె నేల రాలెను ....12
రాలిపడిన పూలతోని
జాలువారిన పుప్పుడులతోని
కప్పబడిన పర్వతాగ్రము
పూలకొండవలె గోచరించెను ....13
హనుమ బలమున దద్దరిల్లిన
కొంద జలమును పొంగి పొర్లెను
పరువమొచ్చిన అదవి ఏనుగు
కార్చుకొను మదపు ఝరివలె ....14
పిండ బడిన శిలల నుండి
కారె కాంచన ధారలు
చరచ బడిన కొండ చరియల
కానవచ్చె వెండి చారలు 15
మంద్ర గతి రగల అగ్ని శిఖలు
ధూప తంత్రులు మీటు నటుల
గంధకపు కొండ బండలు
దూర దూరము విసర బడెను 16
హనుమ బలమున ఒత్తిడయిన
శిఖర మంతయు చూర్ణమవగ
కొండ గుహలలొ జంతు జాలము
ప్రాణ భితితో ఘోష లరిచె 17
పీడనమున బయటకొచ్చిన
ప్రాణ భయము కల ఆ అరుపులు
కొండ దరి గల అడవి న్నిట
నాల్గు దిక్కులు నింపి వేశెను 18
గొప్ప చిహ్నము పడగ దాల్చిన
కొండ నాగులు నిప్పు గక్కెను
ఏమి చేయ పాలు పోక
బండ రాళ్ళను కసిగ కొరికెను 19
కరవ బడిన కొండ రాళ్ళు
వేడి విషముకు తాళ లేక
నాగ కోపాగ్నికి మాడి పోయి
వేయి వ్రక్కలుగ పగిలి పోయెను 20
విషము సైతము మార్చగలదని
పేరు గలిగిన కొండ పైని మూలికైనను
ఈ నాగు లేసిన కాటు వలననే
కాలి బూడిదై సమసి పోయెను 21
పక్షివలె కొండ నుండి ఎగిరిపోవుచు
అసురుల పనిదని గంధర్వులనిరి
స్వర్న వరలలో వున్న కత్తులు
వివిధ తిండులు చర్మ దుస్తులు
జుర్ర గలిగిన మేలు రసములు
పూలు గూడిన స్వర్న సజ్జలు
మధువు నిండిన కంచు కుండలు
వదిలి గాలిలో ఎగిరి పోయిరి
సతుల సహితము, మహేంద్ర గిరి
వసము వుండెడి విధ్యాధరులు 22,23,24
మగువ పొత్తుతో మధువు మత్తుతో
పద్మము వలె ఎర్ర బారిన కన్నులతో
గంధ లేపన మాల ధారణ వలన
మెరియు దేహములతో
ఆకాశమున నిలచె విధ్యాధరులు 25
మెడన హారము, చేత గాజులు
కాలి గజ్జెలు, వివిధ సొత్తులు
విస్మయమై, నవ్వులొలుకుచు
మగని చేరిరి వారి భార్యలు 26
గుంపు గుంపుగ పైకి ఎగసిన
విద్యాధరులును మహా యోగులు
అచ్చెరువై చూచుచుండిరి
కొండ వైపును ఏమి జరిగెనని 27
అంత వారు స్వచ్ఛమయిన ఆకసమ్మున
సిధ్ఢ చారణ పురుషులయొక్క
మంచి హృది గల ఋషుల యొక్క
భాషణమ్మును వింటిరి లా! 28
పర్వత సమమై హనుమ చూడుడు
వాయువీతని తండ్రి అగును
వేగవంతుడు అతడు తల పెట్టెను
మకర నెలవగు జలధి దాటను 29
రామ కార్యము చెసి పెట్టగ
తోటి మూకల పరువు నిలుపగ
హనుమ తలచిన జలధి లంఘన
జగతినెవ్వరు చెయలేరు 30
వార్త తెలిసిన విద్యాధరులు
సాటి వానర సంఘ మందున
కొండ అంతగ భూమి నిలచిన
సాటి లేని హనుమ చూసిరి 31
కొండ అంతగ తనువు పెంచిన
మారుతప్పుడు జూలు దులిపెను
చేతులెత్తి వళ్ళు విరిచెను
చెసెనప్పుడొక మేఘ గర్జన 32
ఎగుర బోయిన పవన సుతుడపుడు
జూలు నిండిన తోక దులిపెను
చేత చిక్కిన సర్ప
పక్షి రాజు దులుపు పద్ధతి 33
దులుప బడిన తోక అంతనె
మెలిన పడిను నడుముకప్పుడు
గరుడునకు చిక్కిన సర్ప భాంతి
చూచు వారికది తోచుచున్నది 34
మెడను కొంచెము
భుజము కొంచెము
వంచుచున్న వీర మారుతి
శక్తి ధైర్యము కూడ కట్టెను 36
ఇనుప దూలము వంటి చేతులు
కొండ పైన ఆంచి నొక్కెను
నడుము వంచెను
కాళ్ళు వంచెను 35
దూరమున్న గమ్య దిశగా
దీక్షగా మరి చూచెనపుదు
కనులు ఎత్తి నింగి చూచుచు
శ్వాస అంతయు గుండె నింపెను 37
కోతి మూకల నడుమ హనుమ
ఏనుగు వలె నిలచి ఉండెను
ఎగుర బోవ ముందు కొంగి
వానరులతో ఇట్లు పలికెను 38
విల్లు వీడిన రామ బాణము వలె
రావణ పాలిత లంక కెళ్ళెద,
వాయు వేగముతో వెళ్ళి నేను
జనక సుతనట చూడకున్న,
అదే గతితో, స్వర్గ మెళ్ళి అచట అంతయు వెదికి చూసెద
సీత నచటను చూడకున్న,
కట్టి తెచ్చెద చాల సులువుగ
పట్టి రావణుని ఇచటకు
విజయుడనై తిరిగి వచ్చెద
సీతనైనా వెదికి తెచ్చెద
దొరకని ఎడల, లంక అంతయు
మూల సహితము, రావణునితో
పెకలించు కొచ్చెద 39-42
కోతులందరిలో వీరుడైన హనుమ
వానరులందరికి ఇటుల చెప్పి
మారు పలుకక, తిరిగి చూడక
ఒక్క ఉదుటను పైకి ఎగిరెను
వీరుడైన కోతి మారుతి
గగన వీధిన ఎగిరిపోతూ
ఖగపతి గరుడునితో
తనని తాను పోల్చుకొనెను 43-44
అంత బలముతో పైకి ఎగురుగ
కొండ పైని చెట్ల యొక్క
కొమ్మలన్ని చెదిరిపోగా
అన్ని దిశలా చిమ్మ/విసర బడెను 45
ఒక్క వుదుటన మింట కెగిసిన
హనుమ వెంట, తొడల బలమున
పెరక బడిన మెరయు పూలు, లతలు కలిగిన
వృక్ష సంఘము నింగికెగిరెను 46
ప్రాణ సఖులు దూరదేశమేగు సమయము
వీడుకోలు ఇవ్వవచ్చె బంధు గుంపు వలెననే
హనుమ బలమున నింగి కెగిరిన
వృక్ష సంపద కాన వచ్చెను 47
హనుమ తోడుగ ఎగురుతున్న
సాలవృక్షపు గుంపు అపుడు,
రాజు తోడుగ యుధ్ధమేగు
సైన్య పటాలము వలెనగుపడెను 48
పర్వతమంత హనుమ తనువు
పూలునిండిన లతలు తరులు
నింగికెగిరిన వింత దృశ్యము
అచ్చెరువై చూచె విశ్వము 49
ఇంద్ర భయమున జలధి దాగిన
కొండ
హనుమ వెంట నింగి కెగసిన
వృక్ష బృందము క్రింద పడెను 50
రంగు రంగుల పూలు లతలు
వివిధమైన మొగ్గలతో కలసి
యేయె సదృశ హనుమ నింగినప్పుడు
మిణుగురులు నిండిన కొండవలె నగుపించె 51
వేగ ధాటికి నింగి కెగసిన
నేల జారిన లతలు తరులు
వీడుకోలు అయిన పిదప
ఇంటికేగు బంధువులవలె నగుపడె 52
గాలి తట్టిన సంద్రమందు
రాలిపడిన వివిధ రకముల
మధువు కలిగిన పూలు మొగ్గలు లతలు తరులు
చుక్కలు నిండిన మరో నింగి వలె నగుపడె 53
రంగు రంగుల పూలు, మొగ్గలు
వింత రుచుల మధుర తేనెలు తనువు కంటి
మెరుపు తీగలు కట్టనున్న
మేఘరీతిన హనుమ నగుపడె 54
హనుమ నుండి క్రింద రాలిన
పూలు నిండిన నీల సంద్రము
మిణుకు మనె తారలుదయించిన
నింగి విధముగ భాసించె 55
నింగి కెగిరిన హనుమ చాపిన
బలము కలిగిన బాహు యుగళము
పర్వతాగ్రము పైన నిలచిన
ఐదుతలల నాగు వలె యుండెను 56
నింగి అంతయు మ్రింగ చూచుచు,
అలల సహితము సంద్ర మంతయు
త్రాగు నటులగుపించె
హనుమ అపుడు 57
మెరుపు కాంతితో వెలుగుచున్న
నింగికెగిన హనుమ కన్నులు
కొండ పైన వెలుగుచున్న
రెండు అగ్నుల వలె గోచరించెను 58
ఎర్రబారి గుండ్రమైన విశాలమైన
వానర ప్రముఖుని నేత్ర ద్వయము
ఆకసమున విల్లి విరిసిన
సూర్య చంద్రుల వలె మెరిసెను 59
వింత కాంతితో మెరిసిపోతూ
ఎర్ర బారిన హనుమ ముఖము
సంధ్య కాంతితో వెలుగుతున్న
సూర్య గోళముగా భ్రాంతి పరచె 60
గగన వీధిన వెలుతున్న
వాయుసుతుని వాలము
ఎత్తబడిన ఇంద్ర ధ్వజము
వలె చూపరులకు తోచుచున్నది 61
మెరయుచున్న తెల్ల పళ్ళతో
చుట్ట చుట్టిన జూలు తోకతో
బుద్ధి కుశలుడు పెద్ద హనుమ
సూర్య కాంతితో మెరయుచుండెను 62
ఎరుపు గరికలు బాగ కలిగిన
కొండ రెండుగ చీలినటుల
కోతి అయిన వీర హనుమ
రెండు పిరుదులు తోచుచుండెను 63
వానర కేసరి చంకల నుండి
దూరుతున్న గాలి అప్పుడు
మేఘ గర్జన పోలి ఉన్న
శబ్దమప్పుడు చేయుచుండెను 64
వింత కాంతితో వెలిగిపోతూ
ఉత్తర దిశగా రాలుచున్న
తోక చుక్క వలె నింగి కెగిసిన
హనుమ అప్పుడు తోచుచుండెను 65
భాను వేగమున జలధి దాటు
పెద్ద దేహము గల హనుమపుడు
పెద్ద త్రాటితో కట్ట బడిన
గజము రీతి ఇంక కొంచెము తనువు పెంచెను 66
నీడ అతనిది నీట పడగా
గగన వీధిన హనుమ సాగెను
గాలి బలమున నీట సాగిన
పడవ రీతది తోచుచున్నది 67
హనుమ వేగము వలన కలిగిన
అలల బలమున జలధి అంతయు
కల్లోలమగుచు గోచరించెను 68
కొండ సమమై తనువు గలిగి
నింగి కెగిసిన హనుమ అపుడు
బలము కలిగిన ఛాతి తోటి
ఎగురు అలలను మోదుచుండెను 69
హనుమ వేగ మిచ్చిన గాలి శక్తికి
మేఘ నిచ్చిన ధ్వనుల ఘోషకు
జగతి ఎరిగిన ప్రశాంత జలధి
కల్లోల పడి వణకి పోయెను 70
గగన వీధిన సాగు హనుమ
అలలు తనతో ఈడ్చు కెళ్ళుచు
అట్టి అలలను గగన తలమున
చల్లురీతిన కానవచ్చెను 71
మేరు మహేంద్ర గిరుల సమమౌ
ఎత్తు ఎగిసిన అలలను లెక్క పెట్టుచు
అమిత గతితో సాగి పోయెను
వీర హనుమ 72
మింటికెగిసిన అలలతోనూ
హనుమ వేగ ధాటికి
ఈడ్చబడిన మేఘములతొను
కలిపి చూసిన నింగి అప్పుడు
వసంత సంధ్యను పోలివుండెను 73
నింగి కెగిరిన అలలు తీసిన
నీరు తగ్గిన జలధి నందలి
సొరలు చేపలు మొసలి
నగ్న దేహులుగా గోచరించిరి 74
నీట నుండు సర్ప సంతతి
నింగి నెగురు హనుమ చూచి
తమను మింగ వచ్చిన
గరుడు పక్షిగ తలచుచుండెను 75
ముప్పది యోజనముల పొడవుగనూ
పది యోజన వెడల్పుతోను
జలధి అలపై అలరుచుండెను
హనుమ నీడ అందముగను 76
అలలు పైన మెల్ల మెల్లగ
హనుమ వెంట వచ్చు నీడ
మేఘ పంక్తుల పోలి వుండి
చూడ ముచ్చట గొల్పుచుండెను 77
విస్తార దేహము కలిగి ఉండి
గగన వీధిన సాగు హనుమ
రెక్కలొచ్చి నిరాధారముగ
ఎగురు కొండగ గోచరించెను 78
నింగి కెగిరి హనుమ పోవ
అతని వెంట తోడు వచ్చె అలలు కొన్ని 79
పక్షి రాజు గరుడిని వలె
నింగి నెగురు హనుమ వెంట
గాలి తో మబ్బుల వలె
మేఘ మాలలు తోడు వచ్చె 80
ఎరుపు,తెలుపు, నలుపు మరియు
నీలి రంగుల మేఘమాలలు
హనుమ వైపుకు లాగబడి
వింత కాంతితో మెరిసిపోయెను 81
నింగి నెగురు హనుమ అపుడు
మబ్బు మధ్య ఎగురుతు
అప్పుడప్పుడు మరుగు అవుతూ
దోబూచులాడు చంద్రుని వలె భాసించెను 82
గగన వీధిన సాగి పోవు
హనుమను చూసిన దేవ దానవ
గంధర్వాదులు పుష్ప వృష్ఠిని
కురిపించి కొలిచిరి 83
రామ కార్యము చేయ
నింగి నెగురు హనుమ నపుడు
సూర్య దేవుడు చల్లగ కాచెను
వాయు దేవుడు మెల్లగ వీచెను 84
ఋషులు మునులు హనుమ
గుణములు గానము చేసిరి
దేవ గంధర్వులు భజన చేయుచు
కీర్తి గానము చేయుచుండిరి 85
చాల సులువుగ నింగి ఎగురు
కపిని చూసిన
నాగ, యక్ష, దేవ, రాక్షస
పక్షి గణములు చాల పొగడచు చేసె గానము 86
కపి ప్రముఖుడు నింగి ఎగురుట
చూచుచున్న సముద్ర దేవుడు
ఇక్ష్వాకు కులము తనకు చేసి
మంచి వలన ఇట్లు తలచెను 87
చేయూత హనుమకు ఇవ్వకున్న
నన్ను దెప్పు జనులు అందరు
వివిధ మాటలు నన్ను అందురు 88
నన్ను ఇంతగ పెంచి నతడు
ఇక్ష్వాకు కులముకు చెందు సగరుడు
అట్టి వంశపు రామ చంద్రుని
కార్య సాధన చేయు హనుమ
కొంత అయినా అలువ చూడడు 89
కొంత దరువు విశ్రమించిన
మిగులు దూరము దాట సులువు
ఇందుకు హనుమ ఒప్పు రీతిగ
మెలగి పలుక వలె 90
ఇంత మంచిగ ఆలోచించిన
సముద్రుదప్పుడు నీట దాగిన
స్వర్ణ శిఖరములతో ఒప్పుచున్న
మైనాకునితో ఇట్లు చెప్పెను 91
ఓ పర్వత శ్రేష్టుడగు మైనాకమా
ఇంద్ర దేవుని ఆజ్ఞ మేరకు
అసుర గణములు వాసముండు
పాతాళ కుహరముకు అడ్డు వుంటివి 92
జన్మ సిద్దమై శక్తులు తోడుగ
ధ్వజములెత్తక అసురులుండుటకు
అంతమెక్కడను కానరాని అట్టి
పాతాళ ద్వారము పూర్తిగ మూసి నిల్చితివి 93
ఓ పర్వత రాజమా! చుట్టుకొలతయు
పైకి క్రిందకి పెరగ గలిగిన నేర్పు నీది
అందు వలననే నాదు మొరని ఆలకించి
పైకి పెరగగ నిశ్చయించు 94
భయము గొలుపు రామ కార్యము
సిద్ధి చేయుచు ధైర్యవంతుడు
కోతి వీరుడు హనుమ ఇప్పుడు
నీకు పైగా యెగుర బోవును 95
ఇక్ష్వాకు కులము చెందు మేటి రాజులు
నీకు నాకూ మాన్య వరులే
అట్టి రాజుకు సేవ చేయు
హనుమ కివ్వవచ్చె చేయూత మనము 96
మంచి అవకాశము మళ్ళి రాదు
చేసిన సాయం వృధా పోదు
చేయ వలసినది చేయకున్న
మంచి మనషులు కోపగించెదరు 97
అదిగొ అదిగో యెగురు హనుమ
అతిధి మనకు పూజ్యనీయుడు
పైకి పెరుగుము ఇదే అదను
తాకనిమ్ము అతని పాదము 98
దేవతలకు పూజ్యనీయుడు
స్వర్ణ శిఖరములతో వెలుగు వీరుడు
హనుమ కొంచెము సేద దీరును
మిగులు దూరము మంచిగెగురును 99
హనుమ కార్యము చేసితీరును
సీత రాముని చెంత చేరును
శ్రీరామ కరుణకు పాతృడగుదువు
నీ కీర్తి అంతయు వ్యాప్తి చెందును 100
స్వర్ణ కాంతితో వెలుగుతున్న
మైనాక మంతయు విన్న వాడై
తరులు తీగలు లతల సహితము
ఒక్కటుదుటన పైకి పెరిగెను 101
ఇట్టి విధముగ పైకి యెగసిన
మైనాక గిరికల స్వర్ణ కాంతులు
మబ్బు తునకల మధ్య నుండి
చీల్చు కొచ్చిన రవిని పోలెను 102
నాగ కిన్నెరులకు నెలవై
సూర్య కాంతితో సమమగు వెలుగై
సముద్రుని ఆజ్ఞ పాలించువాడై
మైనాకుడు నీటి నుండి పైకి ఎగసె
చుట్టును నీరు కమ్మినవాడై
చాల ఎత్తుకు ఎదిగిన వాడై
శిఖరి మబ్బులు తాకుచునుండగ
మైనాకుడొక్కటుదుటున పైనకు ఎగసె 103,104
కరిగిన బంగారు వన్నెలు గలిగిన
శిఖరము నింగికి పెరుగుట వలన
నీలి రంగుతో వెలిగిన నింగి
కాంచన ధూళిల ఒప్పుచుండెను 105
స్వయం ప్రకాశమౌ పర్వతమప్పుడు
తన వెలుగులతో నింగి నింపగ
వంద సూర్యులు నింగి కెగిరెనా?
అన్న విధముగ ఒప్పుచుండెను 106
ఒక్క ఉదుటున దారి కెదురుగా
మహా సముద్రము మధ్య నుండి
నింగి కెగసిన కొండను చూసి
అడ్డమే ఇది అని హనుమ తలచెను 107
అడ్డమొచ్చిన మబ్బు తునకలను
ఊదివేయు వాయు వలెననె
ఛాతి తోనే తోపు తోచెను
అమిత గతితో ఎగురు హనుమ 108
హనుమ బలము వేగమంతయు
ఒక్క తోపుతో నీటబడిన
పర్వతమ్ముల శ్రేష్టుడైన
మైనాకుడప్పుడు వెలిగి పొగిడెను 109
ప్రేమ మనసున తాండవించగ
ఆనందము గుండెల నిండి యుండగ
మనిషి రూపము దాల్చి నిలచెను
మైనాకుడప్పుడు తన శిఖరిపైన 110
బలము కలిగిన హనుమ ఎదుట
కరము మోడ్చి శిరస్సు వంచి
భక్తి భావము తొణుకుచుండగ
ఇట్లు పలికెను మంద్ర స్వరమున 111
దుష్కరమౌ సాగర లంఘన
చేయుచున్న వానర వీరుడా!
సేద దీరుము కొంత సమయము
సుఖకరమౌ నా శిఖర తలమున 112
ఇక్ష్వాకు కులముకు చెందు రాజులు
సాగర మంతయు వృధ్ధి చేసిరి
అట్టి వంశమునకు చెందిన రాముని
కార్యమేర్చు నీకు సేవలు చేయుట మాకు ధర్మము 113
ఉపకారికి ఉపకారము చేయుటన్నది
మనకున్న ప్రాచీన ధర్మము
రఘు వంశమునకు ప్రతి సాయము
చేయుటన్నది సాగరుని ధ్యేయము 114
నీపై కలిగిన భక్తి భావమ్న
వంద యోజనముల లంఘన మధ్య
కొంత అదనుకు విరామమివ్వమని
సాగరుడు నన్ను ప్రేరేపించెను 115
మాదు విన్నపము ఆలకించి
కొంత సమయము సేద దీరుము
మిగిలిన దూరము ఎంతో లేదు
సునాయాసముగ దాట గలవు 116
అందు వలననే వానర వీరా!
ఇందు గల వివిగో మధుర ఫలములు
మిగుల రుచి కల కంద మూలములు
వీటిని గైకొని సేద దీరుము 117
ఇంతే కాదు వానర ప్రముఖా
లోకము లెరిగిన బంధమొక్కటి
విలువలు నిండిన మాట ఒక్కటి
నీతో మాకు తధ్యమన్నది 118
వానర వీరా! వాయు నందన
అమిత వేగము ఎగుర నేర్పుయు
గలిగిన వానర మూకల నడుమ
గొప్ప వాడివని తలచుచుంటిని 119
అతిధి ఎంతయు అల్పుడైనా
దైవమేనని ధర్మమన్నది
నాది భాగ్యము ఏమి చెప్పను
నీ వంటి వీరుడు అతిధి అయ్యెను 120
వానర ప్రముఖా వాయు నందనా
దేవతలందున వేగ వంతుడు
నీ జన్మ నిచ్చిన వాయు దేవుడు
అతనికి సముడవు వేగమునందున 121
నీ పూజలన్నియు వాయుని చేరును
ధర్మ వేత్తవు నిను పూజించెద
ఇందుకు కారణము వేరొకటున్నది
మనవి చేసెద శ్రద్ధగ వినుము 122
కుమారా వినుము కృతయుగమున
కొండలన్నియు రెక్కలు గల్గెను
వాయువు మరియు గరుడ సమానము
వేగము కలిగి అటునిటు ఎగిరెను 123
అటునిటు ఎగురు కొండలు చూసి
తమపై పడునని తలచి వగచిన
దేవులు ఋషులు జంతు జాలములు
భయకంపితులై గజగజ వణకిరి 124
అశ్వమేధములు వందలు చేసిన
ఇంద్రదేవుడు కోపము చెంది
వజ్రాయుధమును చేతను పూని
వేలకొలదిగా రెక్కలు నరికెను 125
క్రోధము కలిగిన ఇంద్రదేవుదు
నాదరి చేరెను, ఆయుధమెత్తెను
అప్పటి క్షణమున వాయు దేవుడు
దూరమునన్ను త్రోసివేసెను 126
అప్పటినుండి వానర వీరా!
జలధి గర్భమున, రెక్కల సహితము
దాగిన నన్ను, నీ తండ్రి వాయువు
కంటికి రెప్పగా కాచుచుండెను 127
అందుకు వాయువు నాకు పూజ్యుడు
అందువలననే పూజ్యుడగుదువు
మన ఈ బంధము వానర ప్రముఖా
విలువైనదిగా నాకు తోచెను 128
అందువలననే నామొర నాలకించి
వానర వీరా సేద తీరుము
హృదయానందము మాకు ఇవ్వుము
పూజ లందుము మా ముదమారా
మాప్రార్ధనను ఇక మన్నించుము
మా ప్రేమాదరమ్ములు స్వీకరించుము 130
అంతయువిన్న హనుమ పలికెను
పర్వత రాజము మైనాకునితో
సంతసించితిని నీదు మనవిని
నీ సోకమ్మును తీసి పోయెద 131
కార్య దీక్షతో నేను వుంటిని
కాలము దాటి పోవుచున్నది
ప్రతినను నేను పూని వుంటిని
పని వీడి నిటనే నిలువ జాలను 132
నవ్వు ముఖముతో ఇట్లు వచించుచు
అవనత శిరుడై కొండను తాకెను
తిరిగి గగన వీధిన ఎడలి పోయెను
అమిత వేగముగ ధీర మారుతి 133
పర్వత రాజుయు సముద్ర దేవుడును
భక్తి భావమున చేతులు ఎత్తి
నింగి కెగసిన హనుమను చూచుచు
దీవెనల వర్షము కురుపించితిరి 134
నింగి కెగిరిన ఆంజనేయుడు
వాయు వేగమున తండ్రి పధమున
సముద్రము మరియు మైనాకము విడిచి
ముందుకు సాగెను నీల గగనమున 135
వాయు నందనుడు గతిని పెంచెను
పై పై కెగురుచు క్రిందకి చూచెను
గగన తలమున ముందుకు సాగుచు
బలము పుంజుకుని మరి పైకెగెరెను 136
మొదటి కార్యము లంఘన కాగా
రెండవ మహత్కార్యము హనుమ చెయునని
వినిన దేవులు, సిధ్ధులు, ఋషులు
ముక్త కంఠముతో భళ భళ అనిరి 137
అక్కడున్న దేవతలునూ
వేయి కన్నుల దేవేందృడునూ
స్వర్ణ కాంతిగల మైనాకుడు చేసిన
కార్యము గని సంతసించితిరి 138
ఆనందమున కంపిత స్వరుడై
పర్వత శ్రేష్టుడు మైనాకునితో
బుధ్ధిశాలి అగు దేవేంద్రుడు
సందర్భోచితముగ ఇట్లు పలికెను 139
ఓ మైనాకుడా బుద్ధి శాలివి
అభయ మిచ్చి తిని, సంతసించితిని
వంద యోజనములు ఆగక సాగెడి
హనుమకు సాయము చేయ దల్చితివి 140
సంకటములకు తలను వంచక
రాముని కార్యము చేసెడి హనుమకు
సేద తీర్చగ మనము నెంచితివి
అందుకు ప్రతిగా అభయ మిచ్చితిని 141
అదివిని మైనాకుడు సంతసించెను
ఆశీస్సు లంది అచటనె నిల్చెను
వేగము పెంచిన హనుమ అంతలో
వెనకకు చూచుచు ఆదరి దాటెను 143
అంతట దేవులు గంధర్వులును
రుషులును మునులు అలోచించుచు
సూర్యుని సమమగు బుద్ధి సాలియగు
నాగుల మాతగు శురసను పిల్చిరి 144,45
పరమ వీరుడు వాయు నందనుడు
హనుమను పేరుతో అతివిఖ్యాతుడు
సాగ లంఘన చేసెడి వీరుడు
అతి భయంకరమగు కోరలు కలిగి 146
ఆకసమంత తనువును పెంచి
క్రూరాతి క్రూరమైన రూపము దాల్చి
అగ్ని గోళములవలె కన్నులు కల్గి
హనుమ దారికి అడ్డము వెళ్ళుము 147
హనుమకు వున్న ధర్య సాహసము,
బుద్ధి కుశలతలు చూడగోరెదము.
నిను గెలిచిన అతనికి విజయము
లేని పక్షమున దుఖితుడగును 148
అదివిన్న శురస అట్లే అనుచు
అతి భయంకరమౌ రూపము దాల్చెను
అది చూచీందరు గజ గజ వణకిరి
అటు వచ్చు మారుతిని ఆపి అన్నది 149 50
"ఓ వానరోత్తమా అచటనె నిలుమా
దేవతలొసగిన తిండివి నీవు
నిన్ను తినెదను, నా నోట దూరుము" 151
అదివిని మారుతి హాసము చేసెను
వినయము చూపుచు చేతులు మోడ్చెను
సున్నిత స్వరమున, బుజ్జగింపుగా
శురసను చూసి ఇట్లు పలికెను 152
"దశరధ తనయుడు రామ చండ్రుడు,
భార్య సీతయు, తమ్ముడు సౌమిత్రితో,
తండ్రి మాటను శిరమున దాల్చి
దండకారణ్యమున వసించుచుండిరి 153
రాక్షస జాతికి విరోధి రాముడు
వేరొక పనిపై తిరుగుచుండగా
జగమెరిగిన సతి, మాత సీతను
అపహరించెను రావణ హతకుడు 154
రాముని ఆనతి గొని ఏగుచుంటిని
సీత కడకు నే రామ బంటునై
రామ రాజ్యమున వశించుచుంటివి
తగిన సాయము నీవును చేయుము 155
అది తగని పక్షమున
నా ప్రతిన ఇది వినుము
సీత జాడను, ప్రభువుకు చెప్పెద
పిదప నీకడకు తప్పక వచ్చెద " 156
కోరిన రూపము దాల్చ శక్తి గల
శురస విన్నది మారుతి మాటలు
తనని జయించగల వీరులు లేరని
తనకున్న వరమును శురస తెలిపెను 157
హనుమ బలమును తెలుసుకొనుటకు,
నాగుల మాతయు, శక్తి సంపన్నయు
ఐన శురస, హనుమను ఆపి
ఇట్లు చెప్ప సాగెను 158
ఓ వానరోత్తమ పూర్వ కాలమున
బ్రహ్మొక వరము ఇచ్చి వుండెను
నానోట దూరక నను దాట జాలవు
అనుచు శురస నోరు తెరిచెను 159
సురస అన్నది విని
హనుమ కోపగించెను
పది యోజనములు తనువు పెంచెను
పెరిగిన హనుమను చూసిన సురస
ఎరువది యోజనములు నోరు తెరిచెను
అది చూసి హనుమ ఉగ్రుడయ్యెను
ముప్పది యోజనములు తనువు పెంచెను
వెంటనే సురస నలుబది యోజనములు
పెద్దగ నోరుతెరిచెను
హనుమ పెరిగెను ఎబది యోజనములు
సురస పెంచెను అరువది యోజనములు
హనుమ దీటుగా పెంచె తనువును
దెబ్బది యోజనములు
సురస క్రమము తప్పక, పోటీపదుచూ
నోరు తెరిచెను ఎనుబది యోజనములు
హనుమ ఉగృడై పెరిగే తొంబది యోజనములు
167.
నరక తుల్య మును అతి భయంకరమును
పదును దంతములు, పెద్ద నాలుకయు ఐన
నోటిని హనుమ చూసెను, ఆలోచించెను
వేలు అంతగా తనువు దించెను
బుధ్ధి కుశలుడు, ఒక్క ఉదుటన
నోట దుమికెను, అమిత వేగముతో
బయటకొచ్చెను, నింగిన నిలచి
సురసను చూసి, ఇట్లు పలికెను
దక్షుని సుతవు, నీకు వందనములు
నిక్కము నీనోట వెళ్ళి వచ్చితిని
నీదు వరమును నిజము చేసితిని
నేనిక వెళ్ళెద, సీత వెదికెద.
రాహువు నోట విడిన చంద్రుని వలే
తన నోట బయటికి వచ్చిన హనుమను
చూసిన సురస, నిజ రూపు దాల్చెను
హనుమను చూసి ఇట్లు పలికెను
"వానరోత్తమ ఓ హనుమంత
నిజము పలికితివి ఇక నీ వెళ్ళుము
సీతను కనుగొని రామునికిమ్ము
నీ తలచిన కార్యము పూర్తిచేయుము"
అతి దుర్భరమౌ మూదవ కార్యము
బుధి కుసలతతో నెరవేర్చిన
హనుమను చూసి, దేవతలందరు
మెచుకోలుగా, భళి భళి అనిరి.
అంతట హనుమ గరుడ వేగమున
నింగికి ఎగసెను ముందుకు సాగెను
174-81
మేఘముల నెలవును, పక్షుల పధమును
గాన గంధర్వులు, తుంబుర సంచరితమును
అమిత వేగము కలిగిన విమాన భూషితమును
వజ్రాయుధ సమమౌ ఉరుములు కలదియు
పుణ్య పురుషులకు నెలవైనదియు
వివిధ గ్రహములు, సూర్యుడు, చంద్రుడు
తారల తళుకుల మెరయు చున్నదియు,
యక్షులు, నాగులు, గంధర్వాదులు,
రుషులు, మునులకు నెలవైనదియు,
గంధర్వ రాజగు విశ్వవసువును,
ఇంద్రుని గజము ఐరావతమును,
అమిత వీరులగు విద్యాధరులు
మెదలు చుండెడి పవిత్ర పధమును,
నరులెన్నటికి చేరలేనిదియు,
ఐన పవిత్రమౌ ఆ గగన తలమున,
నిరాధారముగ హనుమ ఎగసెను
రెక్కలు చాచిన పక్షి రాజువలే.
సిద్ధ దేహము దాల్చ గలిగిన
శింహికను రాక్షసొక్కటి
ఎగురుతున్న మారుతిని గని
ఇట్లు తనలో తలచు కున్నది...182
చాల కాలము గడచినాక
పెద్ద జంతువు చూసినాను
తిండి దొరకక మాడు చుంటిని
విందు దొరికెను, సంతసించెద ..183
శింహిక ఇట్లు మదిన తలచి
హనుమ నీడను పట్టి లాగెను..
నీడ చిక్కగ వేగముడిగిన
హనుమ ఇటుల ఆలోచించెను...184
జలధి నందొక పెద్ద నావ
ఎదురు గాలులు ఈదు నటుల
నా వేగమంతయు నీరుగారెను
నను వెనకకెవరో లాగు నటుల ..185
ఆలోచించుతూ ఆలసించక
అటునిటు చూసెను పైనకి చూసెను
క్రింద జలధిన పెద్ద్ జంతువు
పైకి ఎగసుట చూసె మారుతి ..186
అతి భయంకరమౌ ఆ జంతు ముఖము చూసి
"నీడనాకర్షించు వింత శక్తి కలిగి
అతి భయంకరముగా అగుపించు నిది
సుగ్రీవుడుచించినదియే తధ్యము"
అని తలచిన హనుమ అది శింహికని గుర్తించెను ..187-188
అతి విశాలమౌ హనుమ దేహము చూసి
పాతాళ బిలమువలే అతి భయంకర్ముగ
నోటిని థెరిచెను
హనుమను మ్రింగగ తలచి ..189
మేఘమువలే గర్జించి దుమికెను
మారుతి వైపుకు శింహిక మ్రింగను
తన దేహ మంత తెరిచున్న నోటిలో
శింహిక గుండెను హనుమ చూసెను .. 190-191
అతి వేగ గతిని, రేణు మాత్రమున
దేహము కుంచించి, ఒక్క ఉదుటన
శింహిక నోటిలో హనుమ దుమికేను .. 192
ఋఆహువు నోటికి చిక్కిన పున్నమి
చంద్రుని వలే, శింహిక నోటికి
చిక్కిన హనుమను, శిద్ధులు
చారణలు చూచుచుండిరి
అతి విస్మయముగా కన్నులు తెరచి ..193
అంతట హనుమ వాడి గోళ్ళతో
శింహిక శరీర భాగములు చించెను
ఎంత వేగముతో లోనకు దుమికెనో
అంతే వేగిన బయటకు ఎగిరెనూ ..194
బుద్ధి కుసలతా, ధైర్య సాహసములు
సామర్ధ్యమును, ముందుచూపులతో
తీసివేసెనూ శింహిక అసువులు
తిరిగి పెంచెనూ తనువును పెద్దగ ..195
మారుతి చేతిలో గుండెలు పగిలిన
శింహిక కూలెనూ సాగర మందున
శింహికను చంపిన హనుమను చూసి
గగన చారులు ఇట్లు పలికిరి ..196
"వానరోత్తమా జయమగు గాక
పెద్ద జీవినీ నేల కూల్చితివి
సాహస కార్యము చేసి చూపితివి
పవిత్ర కార్యము ముందు వున్నది
ముందుకు సాగి నెరవేర్చగలవు." ..197
ఓ వానరోత్తమా,
ధైర్యము, బలము, బుధ్ధి కుశలత,
ముందు చూపులను నాలుగు గుణములు,
నీ వలెననే ఎవరికి గలిగిన,
తప్పక నెరవేరు, తలచిన కార్యము ." ..198
గమ్యము పైన దృష్టిని నిలిపి
గరుడుని వలే నింగికి ఎగిరెను
ముందుకు సాగెను అమిత వేగముగ
అభినందనలు స్వీకరించి అటనుండి. ..199
నూరు యోజనముల సంద్రము దాటి
ఆవలి దరిగని సంత సించెను
ఆవలి దరిగల వృక్ష పంక్తులను
హనుమ చూసెను ఆనందించుచు ..200
వివిధ వృక్షములు, పచ్చని అడవుల
అతి సుందరముగా అలరుచున్నదగు
మలయ పర్వతమును హనుమ చూసెను
సంద్రపు ఆవలి దరి చేరగనే ..201
ఆవలి గట్టును చేరిన హనుమ
సముదృని మరియు అతని భార్యలను,
ఆ తీరమును, వృక్ష సంపదను,
నింగిని తాకెడి తన దేహమును
నిర్మల చిత్తుడై తేరిచూచుచూ
తనలో ఈ పరి అలోచించెను
"విశాల దేహము, అమిత వేగమూ
నన్నీ రూపున అసురులు చూసిన
కాగల కార్యము భంగము కలుగును" ..202-204
భౌతిక బంధములు వీడి
నిజమును కనుగొన్న వానివలే,
విష్నువుకిచ్చిన మూడు అదుగులతో
సర్వము వీడిన బలి చక్రవర్తి వలే
పర్వత సమమౌ మారుతి దేహము
కుంచించి ధరించె నిజ రూపమును 205.206
తలచిన రూపము దాల్చ గల వాడై
శతృవు చేత వోటమి నొందని వాడై
వంద యోజనముల సంద్రము దాటినవాడై
ముందుకు సాగెను గమ్యము మదిన మెదిలిన వాడై ..207
అంతట హనుమ కేటక ఉద్దాలక
నారికేళ ఫల వృక్ష సంపదలతో
అతి సుందరమగు లోయలతోనూ అలరారెడి
లంబ పర్వతపు శిఖరము చేరెను ..208
పర్వతాగ్రమును చేరిన హనుమ
లంకను చూసెను ఆనందించెను
సహజమగు తన కోతి చేష్టలతో
సిఖరము పైనా నివాసముండెడి
పక్షుల జీవులా విసిగించుచుండెను ..209
Friday, January 12, 2007
Friday, December 08, 2006
ఒక్క వాక్యములో మొదటి సర్గ:
మారుతెగిరిన పద్ధతి,
మైనాకుడాపిన సంగతి,
సురసకొచ్చిన పరపతి,
సింహికకు పట్టిన గతి,
వెరసి మారుతి
జలధి దాటిన గమనగతి
చెప్పితి!!
మైనాకుడాపిన సంగతి,
సురసకొచ్చిన పరపతి,
సింహికకు పట్టిన గతి,
వెరసి మారుతి
జలధి దాటిన గమనగతి
చెప్పితి!!
Subscribe to:
Posts (Atom)